వివాహేతర సంబంధం నేరం కాదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

-

వివాహేతర సంబంధం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహేతర సంబంధం కేసులో తన భార్య ప్రియుడిపై ఓ భర్త కేసు వేశాడు.అయితే, కేసు నుంచి ఈ నెల 17న ప్రియుడికి ఢిల్లీ హైకోర్టు విముక్తి కలిగించింది. వివాహేతర సంబంధం నేరమంటూ ఐపీసీ 497వ సెక్షన్ ప్రకారం రాజ్యాంగ బద్ధం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ గుర్తుచేశారు.

వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమనీ, దాన్ని నేరంగా చూడకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని ఆమె గుర్తుచేశారు.ప్రస్తుత కేసులో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, వారిద్దరూ ఓ హోటల్లో శారీరకంగా దగ్గరయ్యారని మహిళ భర్త ఆరోపించాడు.ఈ కేసులో ప్రియుడిని మేజిస్ట్రేట్ కోర్టు విడిచిపెట్టగా, ఆ తీర్పును సెషన్స్ కోర్టు కొట్టివేసి, ప్రియుడికి సమన్లు పంపింది. దీన్ని ప్రియుడు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయగా వివాహేతర సంబంధం నేరం కాదు అంటూ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news