ఏపీలో దారుణం.. పవన విద్యుత్‌ గాలిమర నుంచి జారి వేడాడుతున్న ఉద్యోగి

-

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండలోని నింబగల్లు వద్ద పవన విద్యుత్‌ గాలిమరకు మరమ్మత్తులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు సుందరేశ్‌ అనే ఉద్యోగి కిందకు జారిపడపోయాడు.

నడుముకు రోప్ వే(తాడు) ఉండటంతో ప్రమాదం తప్పింది. కానీ, గాలిమరకు కట్టిన తాడుతో ఆకాశానికి భూమికి మధ్యలోనే ప్రమాదకరంగా వేలాడుతూ ఉండిపోయాడు. వెంటనే గమనించిన తోటి సిబ్బంది, స్థానికులు, అగ్నిమాపక అధికారులు సమన్వయంతో అతన్ని కాపాడి కిందకు దించారు. తాడులో ఇరుక్కున్న అతడిని కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news