రక్షాబంధన్ కానుకగా మహిళలకు ఉచిత బస్ సర్వీసులు..!

-

రక్షా బంధన్​ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. ఈ సేవలు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండనున్నాయి.రక్షా బంధన్​ సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం మహిళలకు కానుకనిచ్చింది. అన్ని కేటగిరీల మహిళలకు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు.. ఉచితంగా బస్సు సర్వీసును అందించనున్నట్టు ప్రకటించింది యూపీఎస్​ఆర్​టీసీ.రక్షా బంధన్​ నేపథ్యంలో స్వీట్​ షాపులు, రాఖీలు అమ్మే దుకాణాలు ఆదివారం తెరిచే ఉంటాయని అధికారులు తెలిపారు. దీనితో పాటు విస్తృతంగా పెట్రోలింగ్​ చేయాలని పోలీసులను ఆదేశించారు.

Free bus

కరోనా నిబంధనలు పాటిస్తూ రక్షా బంధన్​ను జరుపుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​.దేశవ్యాప్తంగా సోమవారం.. రక్షా బంధన్​ను జరుపుకోనున్నారు ప్రజలు.
ఢిల్లీ ఎన్నికల ముందు బస్తీ దవాఖాన లతో పాటు,కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు ఇదేవిధంగా మెట్రో ప్రయాణంతో పాటు, ఉచిత బస్సు సర్వీసులను మొదలుపెట్టినట్లు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version