తెలంగాణాలో ప్రతీ ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా వ్యాక్సినేషన్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వ్యాక్సిన్ అందించడానికి 2500 కోట్లు ఖర్చు అవుతుందని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదని కాసేపటి క్రితం సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రతీ ఒక్కరిని కరోనా బారి నుంచి కాపాడటానికి వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు. ఇక ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం నేడు ఉదయం రాష్ట్రాలకు ఫ్రీగా వాక్సిన్ అందిస్తామని చెప్పింది.
ఆ తర్వాత సీఎం కేసీఆర్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం మే 1 నుంచి 18 ఏళ్ళు పైబడిన వారికి వాక్సిన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ ని రాష్ట్రాలకు 400 కి ఇవ్వాలని ముందు నిర్ణయం తీసుకున్నా విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కు తగ్గింది.