స్వాతంత్య్ర స‌మ‌ర‌ వీరుల‌నుస్మ‌రిద్ధాం.. ఎక్స్‌క్లూజివ్ క‌థ‌నాలు..!

-

ఎంద‌రో మ‌హ‌నీయుల త్యాగాల ప్ర‌తిఫ‌ల‌మే నేటి స్వేచ్ఛ గీతిక‌లు. నూనూగు మీసాల వ‌య‌సులోనే ఉరి కొయ్య‌ల‌ను ముద్దాడి త‌మ ప్రాణాల‌ను తృణ ప్రాయంగా వ‌దిలారు. స్వ‌తంత్రం నా జ‌న్మ హ‌క్కు అంటూ బానిస సంకెళ్ళు తెంచే దిశ‌గా ప్రాణాల‌ను అర్పించారు. అలాంటి స్వాతంత్ర్య స‌మ‌ర యోధుల‌ను గుర్తు చేసుకుంటూ.. వారు ర‌గిలించిన ప్రేర‌ణ‌ను, దేశ‌భ‌క్తిని నేటి త‌రానికి వీలైనంగా తెలియ‌జేయాల‌నే సంక‌ల్పమే మ‌న‌లోకం వీర్ దివాస్‌.

అహింసావాదంతో మ‌హాత్మా గాంధీ స్వాతంత్య్ర ఉద్య‌మం చేప‌ట్ట‌గా.. భ‌గ‌త్‌సింగ్‌, సుభాష్ చంద్ర‌బోస్‌, అల్లూరి సీతారామ‌రాజు.. లాంటి వారు విప్ల‌వ‌వాదంతో ఉద్య‌మం నిర్వ‌హించారు. దేశానికి స్వాతంత్య్రం తేవ‌డం కోసం వారు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు. లాఠీ దెబ్బ‌లు తిన్నారు. జైళ్ల‌కు వెళ్లారు. బ్రిటిష్ వారు పెట్టే హింస‌ల‌కు త‌ట్టుకున్నారు. ప్రాణాల‌ను కూడా ప‌ణంగా పెట్టి దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చేందుకు కృషి చేశారు. ఆ మ‌హానీయుల త్యాగ ఫ‌లితం వ‌ల్లే మ‌నం స్వేచ్ఛా, స్వాతంత్య్రాల‌తో భార‌తావ‌నిలో జీవిస్తున్నాం. ఆగ‌స్టు 15 స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా మనం ఆ మ‌హానుభావుల‌ను క‌చ్చితంగా గుర్తు చేసుకోవాలి. స్వాతంత్య్ర ఉద్య‌మ పోరాటంలో వారు చేసిన త్యాగాల‌ను నెమ‌రువేసుకోవాలి. వారి ధైర్యం, తెగువ‌, స్ఫూర్తి మ‌న‌కు, మ‌న భ‌విష్య‌త్ త‌రాల‌కు ఎంత‌గానో ప్రేర‌ణ‌నిస్తాయి..!

అలాంటి ప్రేర‌ణ‌ను, దేశ‌భ‌క్తిని నేటి త‌రానికి వీలైనంగా తెలియ‌జేయాల‌నే సంక‌ల్పమే మ‌న‌లోకం “వీర్ దివాస్‌”

Read more RELATED
Recommended to you

Exit mobile version