పోస్టు ఆఫీసు నుంచి రూ. 33 ల‌క్షలు చోరీ

-

పోస్టు ఆఫీసు నుంచి రూ. 33 ల‌క్షలు చోరీకి గురి అయ్యాయి. ఈ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలోని రామ‌చంద్రాపురం పోలీసు స్టేషన్ ప‌రిధిలో గ‌ల బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ లో ఉన్న పోస్టు ఆఫీసు లో ఆదివారం చోటు చేసుకుంది. కాగ ఆదివారం పోస్టు ఆఫీసు నుంచి కొంత మంది దుండ‌గులు రూ. 33 ల‌క్షల‌ను అప‌హ‌రించారు. అనంత‌రం దొంగ త‌నంపై ఎలాంటి అనుమానాలు రాకుండా ఒక దుప్ప‌టికి నిప్పు పెట్టి.. పోస్టు ఆఫీసులో వేశారు. అయితే పోస్టు ఆఫీసు నుంచి మంట‌లు తీవ్రంగా రావ‌డంతో స్థానికులు అగ్ని మాప‌క సిబ్బందికి స‌మాచారం అందిచారు.

ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న అగ్ని మాప‌క సిబ్బంది.. మంట‌ల‌ను అదుపు చేశారు. అనంతరం చోరీ విషయం బ‌య‌టప‌డింది. కాగ ఈ ఘ‌ట‌నపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. కాగ ప్ర‌జల‌కు పింఛ‌ను డ‌బ్బులు పంపిణీ చేయ‌డానికి శుక్ర‌వారం సాయంత్రం రూ. 20 ల‌క్షలు తీసుకుని వ‌చ్చారు. అలాగే పోస్టు ఆఫీసు లో ఇప్ప‌టికే రూ. 13 ల‌క్షలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని పోస్టు ఆఫీస్ అధికారులు లాక‌ర్ లో వేశారు. కాగ ఆదివారం దుండ‌గులు వ‌చ్చి లాక‌ర్ ను క‌ట్ చేసి రూ. 33 ల‌క్షల‌ను అప‌హ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version