అమెరికాలో కాలు మోపాలంటే గతంలోలా అంత వీజీ కాదండోయ్.. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి మొదలు నేటి వరకూ కూడా వీసా అప్రువల్ విషయంలో లెక్కకి మించిన నిభందనలు తీసుకు వచ్చాడు. విద్యార్ధి వీసా విషయంలో సైతం ట్రంప్ నిభందనలవలన అమెరికా వెళ్లి చదువుకునే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోయింది. ఉన్నత ఉద్యోగం కోసం వెళ్ళాలంటే ఇమ్మిగ్రేషన్ పెట్టె కండిషన్లు అన్నీ దాటుకుంటూ రావాలి.
అయితే అమెరికా ఇమ్మిగ్రేషన్ వారు ఇంటర్వ్యూ లలో అడిగే ప్రశ్నలకి చిన్న సమాధానం తేడాగా వచ్చినా, సరే వీసా రిజక్ట్ అయినట్టే. ఈ మధ్య కాలంలోనే లెక్కకి మించిన వీసా అభ్యర్ధనలు రిజక్ట్ అయినట్టు అధికారులు సైతం వెల్లడించారు కూడా. కానీ అమెరికాకి వెళ్ళాలని అనుకునే 14 ఏళ్ళ లోపు బాలలకి, 79 ఏళ్ళ వృద్ధులకి వీసా ఇవ్వడంలో ఓ వెసులుబాటు కల్పించింది అమెరికా..
సెప్టెంబర్ 1 నుంచీ జరగనున్న వీసా ఇంటర్వ్యూ లలో 14 ఏళ్ళ లోపు బాలలకి, 79 ఏళ్ళ వృద్ధులకి మినహాయింపు ఇచ్చింది. కొత్త ధరఖాస్తులతో పాటు రెన్యువల్ వరకూ ఈ వెసులు బాటు వర్తిస్తుందని ప్రకటించింది. ఈ విషయాన్ని భారత్ లో ఉన్న అమెరికా కాన్సులేట్ ట్రావెల్ ఏజెంట్స్ కి ఈ మెయిల్ రూపంలో పంపింది. అమెరికా వీసా కోసం వేచి చూస్తున్న పిల్లలు , వృద్ధులకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.