సెంట్రల్ జైలుకు ఫన్ బకెట్ భార్గవ్…!

-

సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించిన వాళ్ళలో ఫన్ బకెట్ భార్గవ్ కుడా ఒకడు. టిక్ టాక్ లో ఫన్నీ వీడియోలు తీస్తూ భార్గవ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఫన్ బకెట్ అని యూట్యూబ్ లో ఒక షో చేస్తూ పాపులర్ అయ్యాడు. అయితే ఇటీవల ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్టు భార్గవ్ పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బాలికను గర్భవతిని చేసాడంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ జరిపిన పోలీసులు అరెస్టు చేసి ఫొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇక బెయిల్ పై బయటకు వచ్చిన భార్గవ్ ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా బాధితులను ప్రభావితం చేసేలా ప్రకటనలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాంతో కోర్టు ఆదేశాల మేరకు భార్గవి అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే గతం లో భార్గవ్ ను కొంతమంది అభిమానించేవారు ఉండగా ప్రస్తుతం మాత్రం అతడిని పట్టించుకునేవారు లేకుండా పోయారు. అంతే కాకుండా అతడు చేసిన పాడు పనికి సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version