అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ చిత్రం అందరి మనసులను కలిచివేసింది. ఆన్‌లైన్ క్లాసులు వినడానికి ఇద్దరు చిన్నారులు ఫ్రీ వైఫై ఇచ్చే ఓ రెస్టారెంట్ దగ్గర కూర్చుని వర్క్ చేసుకుంటున్నారు. సాలియన్ సిటీలోని స్కూలు పిల్లలు వైఫై కోసం పడిన పాట్లను ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. చదువుకోసం పిల్లలు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ భారీగా విరాళాలు వచ్చాయి. మన కరెన్సీలో సుమారు 1.02 కోట్ల విరాళాలు చేకూరాయి.
అలాగే జిల్లా పరిపాలన విభాగం కూడా స్పందించి.. వెంటనే ఆ విద్యార్థులకు ఫ్రీ వైఫై ఏర్పాటు చేసింది. ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో దాదాపు అన్ని కంపెనీలు, ఆఫీసులు మూత వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా ఇటీవల పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి.