నిన్న తమిళ నాడు రాష్ట్రంలో… జరిగిన హెలిక్యాఫ్టర్ ప్రమాదంలో… సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ తో పాటు 13 మంది మరణించారు. దీంతో ఈ సంఘటన పై భారత దేశం ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ప్రమాదం జరిగిన సమయంలో… బిపిన్ రావత్ బతికి ఉన్నట్లు వార్తలు వచ్చినా.. ఆ తర్వాత.. ఆయన మరణించినట్లు ఆర్మీ అధికారులు అధికారిక ప్రకటన చేశారు.
ఇక ఇది ఇలా ఉండగా… శుక్రవారం అంటే రేపు… సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే…. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతం లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు అధికారులు.రేపు సాయంత్రం ఆర్మీ విమానంలో ఢిల్లీకి పార్థివదేహాలు చేరనున్నాయి. శుక్రవారం ఢిల్లీ నివాసంలో ఉదయం గం.11 నుంచి మధ్యాహ్నం గం.2ల వరకు నివాళులర్పించేందుకు ప్రజలకు అనుమతి ఇవ్వనున్నారు అధికారులు. అనంతరం కామరాజ్ మార్గ్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతంలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర జరుగనుంది.
ఆ తర్వాత వారి అంత్య క్రియలు జరుగనున్నాయి.