వింట‌ర్ ఒలింపిక్స్ ను బ‌హిష్క‌రించిన మ‌రో దేశం

-

చైన దేశం లో ని బీజింగ్ లో 2022 జ‌ర‌గ‌నున్న వింట‌ర్ ఒలింపిక్స్ ను మ‌రొక దేశం బ‌హిష్క‌రించింది. బీజింగ్ లో జ‌ర‌గబోయే వింట‌ర్ ఒలింపిక్స్ ను దౌత్య ప‌రం గా బ‌హిష్క‌రిస్తున్నామ‌ని కెనాడా దేశ ప్ర‌ధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. చైనా లో మావ‌న హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతుంద‌ని.. ఇది తమ ను తీవ్రం గా క‌లిచి వేస్తుంద‌ని అన్నారు. అందుకే దౌత్య ప‌రం గా ఈ ఒలింపిక్స్ ను పారాలింపిక్స్ ను బ‌హ‌ష్కిరిస్తున్న‌ట్టు కెనాడా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో తెలిపారు.

అయితే చైనా లో జ‌రుగుతున్న మాన‌వ హక్కుల ఉల్లంఘ‌న పై ప‌లు దేశాలు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి. అంతే కాకుండా.. చైనా కు వ్య‌తిరేకం గా నిర‌స‌న గ‌ళం కూడా వినిపిస్తున్నాయి. అయితే 2022 లో బీజింగ్ లో జ‌ర‌గ‌బోయే ఒలింపిక్స్, పారాలింపిక్స్ ల‌ను ఇప్ప‌టి కే అమెరికా, ఆస్ట్రేలియా దేశాల ప్ర‌తి నిధులు దౌత్య ప‌రం గా బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు తెలిపారు. అయితే ఇప్పుడు ఈ దేశాల తో పాటు కెనాడా కూడా చేర‌డం తో.. మ‌రి కొన్ని దేశాలు కూడా ఈ ఒలింపిక్స్ ను బ‌హిష్క‌రించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version