సుడిగాలి సుధీర్ “గాలోడు” ఓటిటి డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎందులో అంటే ?

-

బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న కమెడియన్ సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో మొదట సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా మారారు. ప్రస్తుతం గాలోడు మూవీ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొని.. కలెక్షన్ల పరంగా నిర్మాతలకు లాభాలు చేకూరుస్తోందని ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.

అంతేకాకుండా సుధీర్ తన కెరీర్లు మొదటిసారి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాని అందుకున్నారని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి ప్రముఖ ఓటీటి సంస్థ భారీ డీల్ కుదురుచుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుధీర్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని డిస్నీ హాట్ స్టార్ ఈ సినిమాని రూ.5 కోట్ల రూపాయలకు శాటిలైట్ ఓటిటి హక్కులను సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. ఇక తాజాగా, గాలోడు సినిమా ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ అయింది. ఫిబ్రవరి 17వ తేదీన ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version