సీఎం రమేష్ ను ఉద్దేశించి.. బీఆర్ ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ వ్యభిచారి సీఎం రమేష్ నా మీద అక్రమ కేసు పెట్టాడని బాంబ్ పేల్చారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. కేటీఆర్ గురించి అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ నేను మాట్లాడినందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నాపై కేసు నమోదు చేశాడని తెలిపారు.

బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుమ్మక్కయి ఎన్ని కేసులు పెట్టినా మీకు భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. మా పార్టీ నాయకుల గురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే సీఎం అయినా, ఎంపీ అయినా తప్పకుండా తిప్పికొడతానని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్.
మా నాయకుడి కేటీఆర్ పై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తే ఎన్నిసార్లైనా ఖండిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు పెట్టుకుని జైలుకు వెళ్లిన వాళ్లమని వివరించారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లం కాదు మేము అంటూ వార్నింగ్ ఇచ్చారు గ్యాదరి కిశోర్.