జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజ్ వెల్లడించారు.హెచ్ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.
మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ కర్టెన్ రైజ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని దిల్ రాజు స్పష్టంచేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్ జయసుధ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.కాంగ్రెస్ ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలుగు చిత్రాలను మాత్రమే కాకుండా ఉర్దు చిత్రాలను కూడా ప్రోత్సహిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సినిమా అవార్డులు నిర్లక్ష్యానికి గురైందన్నారు.