ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించింది. రేవంత్ సర్కార్ పాలనలో రైతులు పూర్తిగా మోసపోయారు అని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి అన్నారు. రైతు రుణ మాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రైతు రుణ మాఫీపై రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రైతుల తరుపున రైతు రుణ మాఫీపై కిసాన్ మోర్చా చర్చకు సిద్ధంగా ఉంది. గత కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలనే రేవంత్ రెడ్డి అవలంభిస్తున్నారు అని పేర్కొన్నారు.
అలాగే మీ వరంగల్ డిక్లరేషన్ ఏమైంది అని ప్రశ్నించిన ఆయన.. వ్యవసాయ శాఖ మంత్రి బూటక మాటలతో కాలయాపన చేస్తున్నారు. రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో నిరసనలు, తహసిల్దార్ కు మెమరండాలు అందజేస్తాం. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఉపేక్షించేది లేదు. రైతులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే రైతులతో కలిసి ప్రత్యేక పోరాట కార్యాచరణ చేపడతాం. సంక్రాంతి తరువాత రైతుల పక్షాన దశల వారీగా పోరాటాలకు సిద్ధం అవుతాం అని శ్రీధర్ రెడ్డి తెలిపారు.