తెలంగాణాలో కేసీఆర్ నేతృత్వంలోని BRS పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లను ఓడించి వరుసగా గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది. కానీ ఈసారి ఇది జరుగుతుందా అంటే సందేహమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి… రెండు పర్యాయాలుగా కేసీఆర్ అధికారంతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని తెలుస్తోంది. ఇది కాకుండా ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలలో కూడా అసంతృప్తి ఉండనే విషయం క్లియర్ గా అర్థమవుతోంది. ఈ మధ్యనే BRS లో ఉన్న సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావు లు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇక నిన్ననే ఆ పార్టీ సీనియర్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి సైతం పార్టీ మారిన విషయం తెలిసిందే. ఇలా షాకుల మీద షాకులు తగులుతున్న BRS కు కాసేపటి క్రితమే మరో బిగ్ షాక్ తగిలింది.
తెలంగాణ రాజకీయాలు : BRS కు మరో బిగ్ షాక్… !
-