ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల… ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా ?

-

ఆసియా క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ షెడ్యూల్ ను ఐసీసీ కాసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ ఆసియా కప్ లో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ మరియు నేపాల్ జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ ఆసియా కప్ ను పాకిస్తాన్ మరియు శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మొత్తం 13 మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటగా గ్రూప్ స్టేజ్ లో ప్రతి జట్టు రెండు మ్యాచ్ లను ఆడుతుంది. ఇందులో మొదటి నాలుగు స్థానాలలో నిలిచిన జట్లు మాత్రమే సూపర్ 4 కు అర్హత సాధిస్తాయి. చివరి రెండు స్థానాలలో నిలిచిన రెండు జట్లు టోర్నమెంట్ నుండి నిష్క్రమిస్తాయి. కాగా ఈ టోర్నీ లో మొదటి మ్యాచ్ నేపాల్ మరియు పాకిస్తాన్ లకు మధ్యన ముల్తాన్ లో జరుగుతుంది.

ఇక ప్రపంచంలోని ఎందరో అభిమానులు ఎదురుచూసే దాయాదుల మ్యాచ్ పాకిస్తాన్ మరియు ఇండియా ల మధ్యన కాండీ వేదికగా సెప్టెంబర్ 2వ తేదీన జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version