బాబుకు గల్లా అరుణ నుంచి ఫ్రెష్ షాక్ ఇది… మరి జయదేవ్?

-

ఈ సమయంలో పార్టీకి మళ్లీ పూర్వవైభవం రావాలంటే పోలిట్ బ్యూరో సభ్యులంతా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సిన అవసరం ఉందని.. అందుకు తన వయసు సహకరించదని చెబుతూ.. పోలిట్ బ్యూరో నుంచి తప్పుకున్నారు గల్లా అరుణ కుమారి! కేవలం రాష్ట్రమంతా తిరగలేమనే కారణంతో రాజీనామా చేయాలంటే.. ఇప్పుడు బాబు కూడా చేయాలి అనే కామెంట్లు వినిపించాయి. అయితే అది అసలు కారణం కాదని తెలిసినా.. అంతా మౌనంగా ఉన్నారు! అయితే ఆమె రాజినామా చేసింది కేవలం పోలిట్ బ్యూరోకే కాదు.. పూర్తిగా పార్టీకి కూడా అని తెలుస్తుంది.. ఎందుకనేది అందుకు కారణం కాషాయం!!

బాబుతో ఎవరు జీవితకాలం స్నేహితులుగా ఉండలేరు.. తప్పక కొంతమంది, తప్పించుకోలేకో ఇంకొంతమంది బాబుతో ఉంటారేతప్ప.. నిజంగా ఆయనపై నమ్మకంతో కాదనేది చాలామంది చెప్పే మాట! అయితే చిత్తూరు రాజకీయాలనుంచి గల్లా అరుణ కుమారిని వ్యూహాత్మకంగా తప్పించడంలో బాబు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారనే విషయం ఆమె మనసులో బలంగా నాటుకుపోయిందని, అవకాశం కోసం ఇంతకాలం చూశారని.. ఇప్పుడు జంప్ అయిపోతున్నారని తెలుస్తోంది!

అవును… కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పనిచేసి, అనేక మంత్రి పదవులను పొందడంతోపాటు చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించిన గల్లా అరుణకు.. కొడుకు రాజకీయాల్లోకి వచ్చే సరికి సొంత జిల్లాలో చోటు లేకుండా పోయింది! చిత్తూరు జిల్లాలో తనను జీరో చేయడంపై గల్లా అరుణకుారి పార్టీపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నారంట! అలా అని పోని ఆమె కుమారుడు గల్లా జయదేవ్ కు ఏమైనా ప్రాధాన్యత ఉందా అంటే… అది కూడా లేదనేది ఆమె బలమైన నమ్మకం!

దీంతో చిత్తూరులో తనకు పూర్వవైభవం రావాలన్నా.. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు బాగుండాలన్నా.. ఈ సమయంలో భారతీయ జనతా పార్టీలో చేరడమే మంచిదని గల్లా అరుణకుమారి బలంగా నమ్ముతున్నారంట. ఈ సమయంలో బీజేపీలో చేరితే తనకున్న సీనియారిటీకి మంచి గుర్తింపే లభించొచ్చనేది ఆమె నమ్మకం! ఇక వ్యాపార విషయాలకొస్తే… బీజేపీ ఏపీలో అధికారంలో రాకపోయినా, కేంద్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి వ్యాపార కార్యక్రమాలకు ఇబ్బంది ఉండదన్న ఆలోచనలో కూడా ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.

ఫలితంగా మంచి రోజు చూసుకుని.. గల్లా అరుణకుమారి బీజేపీలో చేరబోతున్నారంట! మరి తల్లి ఈ రేంజ్ డెసిషన్ తీసుకుని, బాబు కు షాక్ ఇవ్వబోతున్న తరుణంలో… కేవలం అమరావతిలో ధర్నాలు జరిగినప్పుడు గెస్ట్ అప్పీరియన్స్ కి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు తప్ప అంతకు మించి పార్టీలో జయదేవ్ కి ప్రాథాన్యత లేదనేది ఆయన అభిమానుల మాట కూడా! సో… తల్లితోపాటే జయదేవ్ కూడా ఒకేసారి సైకిల్ దిగిపోతారా లేక… ఇన్ స్టాల్ మెంట్ ల వారీగా ముందు అరుణ వెళ్లి అనంతరం జయదేవ్ వెళ్తారా అన్నది వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Exit mobile version