దిశ నిందితుల మృతదేహాలకు ఇస్తున్న ఇంజక్షన్ ధర ఎంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..

-

దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఎన్‌కౌంటర్ పై NHRC ఫిర్యాదుతో నలుగురు నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఇక దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. గాంధీ ఆసుపత్రిలో మృతదేహాలను భద్ర పరిచారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు మృతదేహాల కోసం ఎదురుచూసిన బాధిత కుటుంబాలు ఇప్పుడు, మృతదేహాలు తమకు వద్దంటున్నారు.

న్యాయం జరిగే వరకు మృతదేహాలు తీసుకోమని తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గాంధీ ఆస్పత్రిమార్చురీలోని నిందితులు మహ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ మృతదేహాలు భద్రపరిచారు. అయితే ఇవి పాడవ్వకుండా ఉండాలంటే వాటికి వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మృతదేహాలకు రూ. 7500 విలువైన ఇంజక్షన్లు ఇస్తున్నారు. వారానికి ఒకసారి నాలుగు మృతదేహాలకు ఈ ఇంజక్షన్ చేస్తున్నారు. కోర్టు ఆదేశాల వచ్చేవరకు ఈ ఇంజక్షన్లు ఇస్తూ డెడ్ బాడీలు భద్రపరచాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version