ఉల్లిదండలతో పెళ్లి చేసుకున్న నూతన వధూవరులు.. వైరల్ ఫొటో..!

-

నేడు దేశంలో ఎక్కడ చూసినా ఉల్లిపాయల రేట్లు ఎంతలా మండిపోతున్నాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల కేజీ ఉల్లిపాయల ధర రూ.200కు పైగానే పలుకుతోంది. అయితే ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఉల్లి ధరలపై జోకులు కూడా పేలుతున్నాయి. అలాగే ఉల్లిపాయలను ఆభరణాలుగా గిఫ్ట్‌లు ఇచ్చుకుంటున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా యూపీలో ఇలాంటిదే మరొక ఘటన చోటు చేసుకుంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాకు ఉల్లిపోగులను గిఫ్ట్‌గా ఇచ్చిన వార్తను మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ నూతన జంట ఉల్లిపాయలతో చేసిన దండలను మార్చుకున్నారు. ఈక్రమంలో వారిని తీసిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఆ దంపతులు అలా చేయడాన్ని చాలా మంది సమర్థిస్తున్నారు. ఉల్లిధరలు దేశంలో ఎలా ఉన్నాయో జనాలకు సింబాలిక్‌గా తెలియజేసేందుకే వారు అలా ఉల్లిదండలను ధరించారని అందరూ అంటున్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ వధూవరుల పెళ్లికి వచ్చిన బంధువులు కూడా వారికి ఖరీదైన గిఫ్టులకు బదులుగా ఉల్లిపాయలనే బాక్సుల్లో తెచ్చి గిఫ్ట్‌లుగా ఇవ్వడం విశేషం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version