2004లోనే 300 ఎకరాలు కొన్నాను..కబ్జా చేయలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వస్తే నేను చర్చకు సిద్ధం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. నా ఎదుగుదలను చూసి ఓర్వ లేఖనే …. లేని ఆరోపణలు చేస్తున్నారని.. 300 ఎకరాలు నేను కొనుక్కున్న ఈ భూమిని 2004లో కొనుక్కున్న.. అప్పుడు కొన్న భూమికి ఇప్పుడు కబ్జా చేశారని ఆరోపణ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కొన్న భూమికి కబ్జా చేసిన భూముకి తేడా తెలియని వాళ్ళు ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నారని.. నిజంగా నేను అక్రమాలు చేసుంటే చట్టపరంగా ఎందుకు ఫిర్యాదు చేయలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. నా తప్పులు లేవు కాబట్టి వాళ్లు చట్టపరంగా ఫిర్యాదు చేయలేకపోతున్నారు.. చిల్లరగాళ్లు చేసేటువంటి ఈ చిల్లర ప్రచారాలను భూపాలపల్లి నియోజకవర్గం ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. నా నిజాయితీ ఏంటో నా ప్రజలకు తెలుసు నా సహచరిని నా కొడుకు ఇద్దరు కూడా ప్రజాసేవలో మాత్రమే ఉన్నారని.. ఇక్కడ టిఆర్ఎస్ గెలుపొందుతుందని వాళ్ళ సర్వేలో తేలడంతో ఊరికే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.