గణేశ్ నిమజ్జనం వేడుకల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన లో 8 మంది మృతి చెందారు. ఇక ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కర్ణాటకలోని హసన్ తాలూకాలోని మొసలిహొసహల్లిలో గణేశ్ నిమజ్జనం వేడుకలు జరుగుతుండగా భక్తులపైకి వేగంగా దూసుకొచ్చింది ట్రక్కు. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. హసన్-మైసూర్ హైవేలో ఒక వైపు వందలాది మంది భక్తులు నిమజ్జనంలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నాయి.