Disha Patani House Firing: బాలీవుడ్ నటి దిశా పటానీకి ఊహించని షాక్ తగిలింది. బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటిముందు కాల్పులు కలకలం రేపాయి. ఉత్తరప్రదేశ్ బరేలీలోని దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు రేపాయి. కాల్పులు తామే జరిపామని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది.

దిశా సోదరి ఖుష్బూ సాధువులను అవమానించారని ఆరోపణలు వస్తున్నాయి. కాల్పులు తామే జరిపినట్టు సోషల్ మీడియాలో చిత్రపరిశ్రమను హెచ్చరిస్తూ ఓ పోస్ట్ పెట్టారు రోహిత్ గోదర గోల్డిబ్రార్ అనే వ్యక్తి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అటు బాలీవుడ్ నటి దిశా పటానీకి భద్రత పెంచారు.