రెండోరోజు గణపతిని ఇలా ఆరాధిస్తే చదువుల్లో ఫస్ట్‌ర్యాంక్‌ గ్యారెంటీ!

-

గణపతి అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టదేవుడు అనే చెప్పాలి. వినాయకుడు విద్యాప్రదాతగా శాస్త్రాలు పేర్కొన్నాయి. విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోవడమే కాకుండా మంచి మార్కులు, ర్యాంకులు రావాలంటే గణపతి అనుగ్రహం తప్పనిసరి.

‘తలచితినే గణనాథుని తలచితి నా విఘ్నములు తొలుగుటకు.. నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడదను దైవగణాధిప! లోకనాయకా!! ”
అనే శ్లోకం ప్రకారం విద్యార్థులు పుస్తకం, పెన్ను పట్టుకోగానే ఒక్కసారి విద్యాగణపతిని మనస్సులో ఓం గం గణపతయేనమః అని ప్రార్థించి చదవడం ప్రారంభిస్తే తప్పక మంచి ఫలితం ఉంటుంది.

రెండోరోజు గణపతి ఆరాధన
వినాయక నవరాత్రుల్లో రెండోరోజు గణపతి తరుణ గణపతి. గణపతి 32 రూపాల్లో ఇద ఒకటి. ఈ రూపంలో గణపతి అష్టభుజి అంటే ఎనిమిది చేతులతో దర్శనమిస్తాడు. ఈ రూపంలో గణపతిని మనస్సులో ధ్యానం చేసుకోవాలి. ఈ రూపాన్ని సంకష్ట చతుర్థినాడు ఆరాధిస్తారు. ఈ గణపతి రూపాన్ని ఆరాధించడం వల్ల శాశ్వత ఆనందం లభిస్తుంది. దీంతోపాటు సంతోషం, ధైర్యం, విఘ్నాలు లేకుండా జీవనాన్ని ప్రసాదిస్తాడని శాస్ర్తాలు పేర్కొంటున్నాయి.

రెండోరోజు గణపతి నవరాత్రులలో  ఎవరైతే వినాయకుడిని ఆరాధిస్తారో వారికి సకల శుభాలు జరుగుతాయి. జయాలు లభిస్తాయి. అందుకే దీన్ని జయవారం అని అంటారు. ఈ రోజు గణపతిని 21 గరికలతో అర్చిస్తే తప్పక కోరుకున్న కోరికలు విఘ్నాలు లేకుండా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఎర్రపూలు ముఖ్యంగా ఎర్ర గన్నేరు, మందారంతో అర్చిస్తే తప్పక విశేష ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు విద్యాగణపతి రూపంలో అనుగ్రహించడమే కాకుండా చక్కని విద్య, ఉత్తమ ర్యాంకులు, మార్కులు లభిస్తాయి.

రెండోరోజు నైవేద్యం:
రెండోరోజు గణపతికి అటుకులు పెట్టాలి. ఈ అటుకులను వివిధ రూపాల్లో నైవేద్యంగా సమర్పించవచ్చు. అటుకులతో లడ్లూ తయారు చేసి లేదా అటుకులు, బెల్లం కలిపి లేదా అటుకుల పాయసం లేదా అటుకులు, కొబ్బరి, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించి తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news