గుజరాత్ లో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్.. మనస్తాపంతో ఆత్మహత్య.

-

ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. కోర్టులు శిక్షలు విధిస్తున్నా.. కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. రోజూ దేశంలో ఎక్కడో చోట అత్యాచార కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొంతమంది ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తున్నారు.. మరికొంత మంది పరువుపోతుందనే భయంతో తమలోతామే కుమిలిపోతున్నారు. కామాంధులు వారి కామ వాంఛ తీసుకోవడంతో పాటు బాధితురాలును కర్కషంగా చంపేస్తున్నారు. మరికొంత మంది మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు.

తాజాగా గుజరాత్ రాష్ట్రం వడోదరలో జరిగిన విషాదకరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న యువతిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్టోబర్ 29న ఆమెపై కొంతమంది దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.

సదురు యువతికి బాసటగా నిలవాల్సిన సహోద్యోగులే పట్టించుకోలేదు. ఎన్జీవోలో పనిచేస్తున్న స్నేహితులు, యాజమాన్యానికి తెలుపగా ఎవరూ.. పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే కనీసం పోలీస్ స్టేషన్ లోకూడా సదరు బాధితురాలు ఫిర్యాదు చేయలేదు. తనలో తానే కుమిలిపోతూ.. తీవ్ర మనస్తాపానికి గురై నవంబర్ 4న వల్సద్ రైల్వే స్టేషన్ లోని రైల్వే కంపార్ట్ మెంట్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన వడోదరా జిల్లా క్రైంబ్రాండ్ ఏసీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఈఘటన జరిగిన 38 రోజుల తర్వాత .. ఎన్జీవోలో పనిచేసే ట్రస్టీతో పాటు ముగ్గురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version