విడాకులపై స్పందించిన సమంత… ఆసమయంలో చనిపోతానని అనుకున్నాను

-

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత- నాగచైతన్య విడాకులు తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. సీని ఇండస్ట్రీలో అప్పట్లో ఇదే హాట్ టాపిక్ అయింది. వరస హిట్లతో టాప్ లో ఉన్న సమయంలోనే సమంత నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విడాకులకు కారణాలేమిటో తెలియకపోయినా.. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట హఠాత్తుగా విడిపోవడం ఇటు ఫ్యాన్స్ నే కాకుండా.. సినీ ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. చాలారోజుల పాటు సమంత మానసికంగా ఎంతో బాధపడేదని… తను చేసిన ఇన్ స్టా పోస్టులను చూస్తే అర్థమయ్యేది.

డైవర్స్ అయిన తర్వాత తొలిసారిగా సమంత స్పందించింది. ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నేను విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నానంది. నేను చాలా బలహీన వ్యక్తిని అని నా ఫీలింగ్. కానీ నేను ఎంత బలంగా ఉన్నానో తెలిసి ఇప్పుడ ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు ఇలా ఉన్నానంటే నాకు చాలా గర్వంగా ఉంది.. ఇలా ఎలా ఉన్నానో నాకు తెలియడం లేదు అంటూ చెప్పుకొచ్చింది సమంత.

విడాకుల తర్వాత సామ్ వరసపెట్టి సినిమాలు చేస్తుంది. పుష్పలో ఐటెం సాంగ్ లో పాటు.. తెలుగులో శాకుంతలం సినిమాను చేస్తుంది. తాజాగా ఓ హాలీవుడ్ మూవీకి కూడా ఓకే చెప్పింది సమంత.

Read more RELATED
Recommended to you

Exit mobile version