రన్నింగ్ కారులో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఉద్యోగం ఇప్పిస్తానని గ్రేటర్ నోయిడాకు చెందిన వ్యక్తి ఇద్దరు బాలికలను లక్నో తీసుకెళ్లాడు. ఆ సమయంలో కారులో మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నట్లు సమాచారం.
నిందితులు ఆ సమయంలో బీర్లు తాగుతూ.. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఓ బాలికను కారు నుంచి బయటకు నెట్టేశారు.దీంతో ఆమె తీవ్ర గాయాల పాలై మరణించగా.. అనంతరం మరో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు బాధితురాలు బలంద్ పహర్ జిల్లా ఖుర్జాలో తప్పించుకుని వెళ్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారును వెంబడించి పోలీసులు ముగ్గురు నిందితులు సందీప్, అమిత్, గౌరవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు.