ఇంటర్ విద్యార్థినికి టీచర్ లైంగిక వేధింపులు..పేరెంట్స్ ఏం చేశారంటే?

-

మహిళలపై, బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు.ఈ క్రమంలోనే ఏపీలో మరోదారుణం చోటుచేసుకుంది.అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఇంటర్ విద్యార్థినిపై కాలేజ్ కరస్పాండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత విద్యార్థిని కథనం ప్రకారం.. తరగతి గదిలో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రాత్రి సమయంలో మెసేజ్‌లు చేస్తున్నాడని సదరు విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.

అతని వేధింపులకు విసిగిపోయిన విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పగా వారు ఆగ్రహంతో ఊగిపోయారు. కాలేజీకి వెళ్లి కరస్పాండెంట్‌ను చితకబాదారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news