వికారాబాద్ జిల్లా పరిగిలో గ్యాంగ్ వార్..100 మంది కూల్ డ్రింక్ బాటిళ్లతో!

-

వికారాబాద్ జిల్లాలో పరిగిలో దారుణం చోటుచేసుకుంది. కొందరు యువకులు ఉన్నట్టుండి గ్యాంగ్ వార్‌కు దిగారు. జన సమూహంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఏం జరిగిందో ఏమో అని అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు రెండు గ్యాంగులుగా ఏర్పడి పబ్లిక్‌లో తగువులాడుకున్నారు.

పరిగి పోలీస్‌‌‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ గ్యాంగ్ వార్ జరిగినట్లు సమాచారం. సుమారు 100 మంది వ్యక్తులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడులకు పాల్పడ్డారు. మరికొందరు కూల్ డ్రింక్ బాటిళ్లతో దాడులు చేసుకున్నారు. ఇదంతా స్థానికంగా ఉన్న షాపుల్లోని సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయి. వీరంతా కొట్టుకుంటూ ఓ టీ షాపులోకి వెళ్లిపోయారు. ఈ ఘటనకు స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news