గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ తమ్ముడిపై రూ.10 లక్షల రివార్డు!

-

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ఎన్ఐఏ ఊహించని షాక్ ఇచ్చింది. అతని తమ్ముడు అన్‌మోల్ మీద జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. రీసెంట్‌గా హత్యకు గురైన ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య, సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యతో పాటు మరో 17 క్రిమినల్ కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు.ఈ కేసుల్లో హంతకులుగా ఉన్న వ్యక్తులతోనూ అతను చాట్ చేసినట్లు పోలీసులు ఆరోపించారు.సల్మాన్‌ ఖాన్‌‌ను చంపేస్తామని బెదిరించిన వారితోనూ అతనికి సంబంధాలున్నట్లు గుర్తించారు.

ఈ క్రమంలోనే ఎన్‌ఐఏ 2023లో అతడిపై చార్జిషీటు వేసింది. కాగా, అన్మోల్ ఇప్పటికే నకిలీ పాస్‌పోర్ట్‌తో దేశం దాటాడు. గతేడాది కెన్యాలో ప్రత్యక్షమైన అన్మోల్..ఈ ఏడాది కెనడాలో కనిపించినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఇక అన్మోల్ ఓ కేసులో దోషిగా తేలి జోధ్‌పూర్ జైలులో శిక్ష కూడా అనుభవించాడు. 2021 అక్టోబర్ 7న బెయిల్‌పై విడుదలైన అతను నాటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని దేశాలు తిరుగుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version