తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..ఉచిత కోచింగ్‌ తో పాటు, రూ.5 వేలు

-

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన చేశారు. ఉచిత కోచింగ్ తో పాటు గ్రూప్ 1 అభ్యర్థులకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ఆరు నెలల పాటు ఇస్తామని వెల్లడించారు.

అలాగే గ్రూప్ 2 అభ్యర్థులకు నెలకు రెండు వేల చొప్పున మూడు నెలల పాటు, ఎస్సై అభ్యర్థులకు రెండు వేల చొప్పున స్టైఫండ్ ఇస్తామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన చేశారు. అభ్యర్థులు ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకుంటే 16వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఎంపికైన అభ్యర్థులకు 21వ తేదీ నుంచి క్లాసులు నిర్వహిస్తామని వెల్లడించారు మంత్రి గంగుల కమలాకర్.తెలంగాణలో ఏసంగిలో అధిక ఉష్ణోగ్రత వల్ల బియ్యం పగిలిపోయి నూకలు ఎక్కవ వస్తాయని..యాసంగిపంటలో 40 శాతం బియ్యం, 60 శాతం నూకలు వస్తాయన్నారు. దీనిని గుర్తుంచుని కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version