హుజూరాబాద్‌ అభివృద్ధికి రూ. 39 కోట్లు : మంత్రి గంగుల

-

హుజూరాబాద్ లో అభివృద్ధి జరుగలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లానని…దీంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే రూ. 39 కోట్లు పట్టణానికి నిధులు ఇచ్చారని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కే కాదు అందరికీ ఆత్మ గౌరవం ఉంటుందని.. గతం లో ఉన్న శాసన సభ్యుడు ఏడు సంవత్సరాలు మంత్రిగా ఉన్న ఆశించిన స్థాయిలో అభివృధ్ధి జరుగలేదని ఫైర్‌ అయ్యారు.

రాష్ట్రం లో అభివృద్ధి జరుగాలేని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోట్ల నిధులు మంజూరు చేశారని.. ముఖ్యమంత్రి దగ్గర అభివృద్ధి పనుల కోసం కాకుండా తన స్వంత పనులకు ఈటల వెళ్ళారని మండి పడ్డారు. ఈటల రాజేందర్ గెలిస్తే బిజెపి ఎంఎల్ ఏ లతో పాటు ఉండడం తప్ప నియోజక వర్గం అభివృద్ధి చెందదన్నారు.

రాబోయే ఎన్నికలు చాలా కీలకం హుజూరాబాద్ అభివృద్ది కావాలా వద్ద అనేది నియోజక వర్గ ప్రజలు ఆలోచించుకోవాలని గంగుల పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజక వర్గం లో ఆశించిన స్థాయి లో అభివృద్ధి జరుగాలంటే టిఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు. అన్ని కులాలకు సమానంగా అందరికీ భవనాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version