తెలంగాణ కౌలు రైతులకు రేవంత్ సర్కార్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. రైతు భరోసా మార్గదర్శకాల్లో కౌలు రైతుల ప్రస్తావన లేదని తెలంగాణ కౌలు రైతులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో కౌలు రైతులకూ రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. కానీ అధికారంలోకి వచ్చాక కోతలు షురూ చేసిన రేవంత్ సర్కార్.. రైతు భరోసా మార్గదర్శకాల్లో కౌలు రైతుల ప్రస్తావన లేదని సమాచారం.
దింతో 23 లక్షల మందిని దోఖా చేశారని రేవంత్ పై మండిపడుతోన్నారు కౌలు రైతులు.
రైతు భరోసా నిబంధనలు
1. ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి, ఆహార భద్రతకు కూడా తోడ్పడుతుంది. అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
2. ఇందుకోసం, తెలంగాణ ప్రభుత్వం “రైతుభరోసా” పథకాన్ని అమలుచేయడానికి నిర్ణయించింది. ఈ పథకం జనవరి 26, 2025 నుండి అమలు చేయబడుతుంది.
3. రైతుభరోసా పథకంలోని ముఖ్యాంశాలు:
3.1 రైతుభరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు రూ.12,000 కు పెంచబడింది.
3.2 భూభారతి (ధరణి) పోర్టల్ లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా సహాయం అందించాలి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుండి తొలగించాలి.
3.3 ROFR పట్టాదారులు కూడా రైతు భరోసాకి అర్హులు.
3.4 RBI నిర్వహించే DBT పద్ధతిలో రైతుభరోసా సహాయం రైతుల ఖాతాలో జమ చేయాలి.
3.5 రైతుభరోసా పథకం వ్యవసాయశాఖ సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వం వారు అమలు చేస్తారు.
3.6 National Informatics Centre (NIC), IT ఈ పథకానికి భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు.