తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారిపై టిడిపి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి దైవ సన్నిధిలో… అలా మరణించడం.. వారు చేసుకున్న అదృష్టం అంటూ బాంబు పేల్చారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
గత నాలుగు రోజుల కిందట తిరుమలలో… తొక్కి సలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో దాదాపు ఆరుగురు చనిపోగా చాలామందికి గాయాలయ్యాయి. చనిపోయిన కుటుంబాలకు ప్రతిపక్షాలు అలాగే ప్రభుత్వం కూడా అండగా నిలిచింది.
వైద్యం దగ్గరుండి అందిస్తోంది చంద్రబాబు కూటమి సర్కార్. ఇక ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిపై విచారణ కమిటీ కూడా వేసింది. అయితే ఇలాంటి నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ సంఘటనపై స్పందించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల దైవ సన్నిధిలో తొక్కిసలాటలో చనిపోవడం వారు చేసుకున్న అదృష్టం అంటూ బాంబు పేల్చారు టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. అయితే జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
తిరుమల దైవ సన్నిధిలో తొక్కిసలాటలో చనిపోవడం చనిపోవడం వారు చేసుకున్న అదృష్టం – టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ pic.twitter.com/9T01fWPYmS
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2025