రేవంత్ ఎప్పుడు ప్రతిపక్షమే..అందుకే వాళ్లపై దాడి…

-

టీపీసీసీ అధ్యక్షుడుగా ఎంపికైన రేవంత్ రెడ్డి డ్డి ( Revanth Reddy ) అధికార టీఆర్ఎస్‌పై మాటల దాడి చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్‌ దగ్గర నుంచి అధికారాన్ని గుంజుకుంటానని రేవంత్ గట్టిగానే మాట్లాడుతున్నారు. అటు బీజేపీని సైతం టార్గెట్ చేసి రేవంత్ విమర్శలు చేస్తున్నారు. అసలు తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేలుగా గెలిచి, టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన 12 మంది ఎమ్మెల్యేలని రేవంత్ గట్టిగానే టార్గెట్ చేశారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

పార్టీ మారిన వాళ్ళని రాళ్ళతో కొట్టాలని అంటున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారే వచ్చారని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ శ్రేణులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నాయి. రేవంత్ పార్టీ మారేటప్పుడు నిజాయితీ కూడిన రాజకీయాలు చేశారని చెబుతున్నారు. మొదట్లో రేవంత్, టీఆర్ఎస్‌కు మద్ధతుగా ఉన్న మాట వాస్తవమే అని, అలాగే 2006లో ఇండిపెండెంట్‌గా నిలబడి జెడ్‌పి‌టి‌సిగా గెలిచారని, ఆ తర్వాత ఇండిపెండెంట్‌గా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచారని గుర్తు చేస్తున్నారు. అప్పుడు టీడీపీతో సహ ఇతర ప్రతిపక్షాల మద్ధతుతో రేవంత్ ఎమ్మెల్సీ అయ్యారని అంటున్నారు.

అలాగే అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా సరే, ప్రతిపక్షాల మద్ధతు ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలోకి వెళ్లారని చెబుతున్నారు. ఇక 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీడీపీ తరుపున గెలిచారని, 2017లో తెలంగాణలో టీడీపీ పరిస్తితి బాగోని సమయంలో, ఆ పార్టీ అధినాయకుడుకు చెప్పి, ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి మరీ, అప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్న కాంగ్రెస్‌లో చేరారని గుర్తు చేస్తున్నారు.

ఇక అక్కడ నుంచి రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యేవరకు ఏం చేశారో అందరికీ తెలుసని, ఒక నిబద్ధతో రాజకీయాలు చేస్తున్న రేవంత్‌కు, కాంగ్రెస్‌లో గెలిచి పదవులకు రాజీనామా చేయకుండా టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు చాలా తేడా ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version