గంజాయి సాగు చేసిన వారికి షాక్… 148 రైతులకు రైతుబంధు పాలని ఎక్సైజ్ శాఖ లేఖ

-

గంజాయి సాగు చేసిన రైతుకు షాక్ తగిలింది. గతం నుంచి తెలంగాణ ప్రభుత్వం గంజాయి సాగుపై ఉక్కు పాదం మోపుతోంది. రాష్ట్రంలో గంజాయి సాగు నివారణకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఎక్సైజ్ శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ పలు జిల్లాల్లో గంజాయి సాగు చేసిన రైతులను గుర్తించింది. తెలంగాణ వ్యాప్తంగా 148 మంది రైతులకు రైతుబంధు ఆపాలని ఎక్సైజ్ శాఖ లేఖలు రాసింది. వీరందరికి వచ్చే జూన్ లో గంజాయి సాగు చేసిన రైతులకు రైతుబంధు ఆపాలంటూ.. ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణలోని 148 మంది రైతులను గుర్తించి 121 కేసులు నమోదు చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. వీరంతా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు లేఖలో తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పలు జిల్లాల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ దాడులు చేసింది. నారాయణ ఖేడ్, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జహీరాబాద్ జిల్లాల్లో ఈ గంజాయి సాగు చేస్తున్న రైతులను గుర్తించారు. అలాగే సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కూడా కొంతమంది రైతులు గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. వీరందరి ల్యాండ్ డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులను ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపింది ఎక్సైజ్ శాఖ పంపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరందరికి రైతుబంధు నిలిపేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version