సీఎం రేవంత్‌…. ఇదేం పాలన? – బండి సంజయ్

-

సీఎం రేవంత్‌…. ఇదేం పాలన? అంటూ ఫైర్‌ అయ్యారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం. పట్టణాల పరిశుభ్రతలో శానిటేషన్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకం. కరోనా మహమ్మారి కాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి అందించిన సేవలు మరువలేనివి. దురదద్రుష్టమేమిటంటే… ఆనాటి నుండి నేటి వరకు వేతనాలు పెంచాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.

పైగా మున్సిపల్ డ్రైవర్లు, వర్క్ ఇన్సెక్టర్లకు చెల్లిస్తున్న వేతనాలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గం. భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ప్రతి ఏటా పెరిగే నిత్యావసర ధరలు, ఇతర ఖర్చులను ద్రుష్టిలో ఉంచుకుని ఉద్యోగుల జీత భత్యాలను పెంచడం పరిపాటి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు పెంచకపోగా ఉన్న వేతనాల్లో భారీగా కోత విధించడం ఎంత వరకు సమంజసం? అంటూ నిలదీశారు. ఇప్పటి వరకు శానిటరీ ఇన్ స్పెక్టర్లకు నెల వేతనం రూ.22 వేలు చెల్లిస్తుండగా, ఆ వేతనాన్ని రూ.16,600లకు తగ్గించడం దుర్మార్గం. అట్లాగే డ్రైవర్లకు సైతం ఇదే విధంగా కోత విధించడం ఎంత వరకు న్యాయం? అని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version