విశాఖ : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ బలవంతుడిగా కనిపించినా…బలహీనమైన నాయకుడని కేబినెట్ విస్తరణతో తేలిపోయిందని పేర్కొన్నారు. క్యాబినెట్ కూర్పుపై సీఎం దిష్టిబొమ్మను, టైర్లను కాల్చుతూ ఆందోళనలు చేయటం నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో మొదటిసారి చూశాను.. CM జరిపిన విద్యా శాఖ సమీక్షలో అ శాఖ మంత్రి పాల్గోకపోవడంతోనే అర్ధం అవుతోందని చురకలు అంటించారు.
నూతన క్యాబినెట్ ఏర్పాటులో ఎక్కడా సమతుల్యత లేదని.. 26 జిల్లాలు అని చెప్పి ప్రధాన నగరమైన విశాఖకు, విజయవాడకు, తిరుపతి మంత్రులు లేకుండా చేశారని వెల్లడించారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాం అంటే ప్రజలు YCPని నమ్మే పరిస్థితిలో లేరని.. టిడిపికి బీసీలు ఎప్పుడూ అ౦డగా ఉంటారని తెలిపారు.
ఎన్నికలు దగ్గరకొచ్చే కొలది టీడీపీలోకి చేరికలు ఎక్కువవుతాయని.. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు రావచ్చు అని వెల్లడించారు. ఎన్నికలకు ఐదారు నెలల ముందు పొత్తులు సర్దుబాట్లు ఉంటాయి తప్ప రెండేళ్ల ముందే ఊహించలేమని.. తమ పార్టీ అధినేత చేపట్టబోయే కార్యక్రమాలను త్వరలోనే అనౌన్స్ చేస్తారని ప్రకటన చేశారు.