ఆ ఎంపీని సొంత పార్టీ ఎమ్మెల్యేలే పక్కన పెట్టారా…!

-

అధికారం, అదీ పదవిలో ఉంటే ఇక ఆ నేత స్పీడ్‌ గురించి చెప్పేది ఏం ఉంటుంది. కానీ ఆ ఎంపీ అందుకు భిన్నంగా ఉంటున్నారు. ఆయన్ని సొంత పార్టీ నేతలే కొంతకాలంగా పక్కన పెడుతున్నారట. ఎమ్మెల్యేలు సైతం ఆయనకు దూరంగా ఉంటున్నారట. గెలిచిన మొదట్లో ప్రభుత్వ కార్యక్రమమైనా.. పార్టీ ప్రోగ్రామైనా యాక్టివ్‌గా ఉండే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొంత కాలంగా సైలెంట్‌ అయ్యారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన ఎంపీయే అయినా అంత సంతృప్తిగా లేరని చెవులు కొరుక్కుంటున్నారు. గెలిచిన మొదట్లో ప్రభుత్వ కార్యక్రమమైనా.. పార్టీ ప్రోగ్రామైనా యాక్టివ్‌గా ఉండే మాగుంట మౌనం అటు వైసీపీలోనూ.. ఇటు ప్రజల్లోనూ హాట్‌టాపిక్‌గా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న మాగుంట.. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. రాష్ట్రవిభజన తర్వాత 2014లో టీడీపీలో చేరి మరోసారి ఒంగోలు బరిలో దిగినా విజయం దక్కలేదు. నాటి వైసీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు.

టీడీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా.. ఎందుకో ఆపార్టీలో పూర్తిగా కుదురుకోలేకపోయారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిన మాగుంటకు సరాసరి ఒంగోలు ఎంపీ టికెట్‌ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తిరిగి ఎంపీ అయ్యారు మాగుంట. గెలిచాక ఐదునెలలపాటు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలతో సఖ్యంగానే ఉన్నారు. తర్వాత అందరితో గ్యాప్‌ పెరిగిపోయింది.

ఎంపీకి.. పార్టీ నేతలకు ఎందుకు గ్యాప్‌ వచ్చిందన్నదానిపై కొందరు ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి.మాగుంటకు ప్రధాన ఆదాయ వనరు లిక్కర్‌ వ్యాపారం. సింగరాయకొండలో ఆయనకు లిక్కర్‌ తయారీ ఫ్యాక్టరీ ఉంది. ఏడాదిగా మాగుంట ఫ్యాక్టరీలో తయారయ్యే మద్యం అమ్మకాలు ఏపీలో లేవట. ఆ విధంగా ఆయన ప్రధాన ఆదాయ వనరుపై వేటు పడిందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఆ కారణంగా ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారట మాగుంట. అందుకే ఎవర్నీ కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు. పార్టీ మీద అసంతృప్తిని ఆ విధంగా వెళ్లగక్కుతున్నారట. ఇదేదో ప్రమాదకరంగా మారుతుందని అనుకుంటున్నారట ప్రకాశం జిల్లా నేతలు. మనకెందుకు వచ్చిన గొడవ ఎంపీకి దూరంగా ఉంటే పోలా అని డిసైడ్‌ అయ్యారట ఎమ్మెల్యేలు .

Read more RELATED
Recommended to you

Exit mobile version