Kavitha: అరవింద్ ను అధ్యక్ష బరి నుంచి తప్పించేందుకు పసుపు బోర్డు ప్రకటన !

-

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ…. ఎంపీ అరవింద్ ను అధ్యక్ష బరి నుంచి తప్పించేందుకు పసుపు బోర్డు ప్రకటన చేశారని సెటైర్లు పేల్చారు కవిత. పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నా, ఏర్పాటు విధానం పై అభ్యంతరాలు ఉన్నాయన్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమం లా చేశారని… ఎంపీ ఆర్వింధ్ గాలి మాటలు మానేయాలని ఫైర్‌ అయ్యారు.

kavitha on aravind

తాను కేంద్రం పై ఒత్తిడి చేయడం వల్లే.. స్పైసెస్ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పసుపుకు మద్దతు ధర. దిగుమతుల నియంత్రణ కోసం గల్లి నుంచి ఢిల్లీ వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. దిగుమతులు పెరిగితే బీజేపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు..? అని నిలదీశారు. పసుపు బోర్డు ఏర్పాటు తోనే సమస్యలు అన్నీ పరిష్కారం కావని వివరించారు. స్పై సెస్ బోర్డు బెంజ్ కారు లాంటిదని, ..పసుపు బోర్డు అంబాసిడర్ కారులంటి దని ఎంపీ అర్వింధ్ అన్నారన్నారు. ఒక వేళ బెంజ్ కారు ఉంటే, అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చారు.? అంటూ చురకలు అంటించారు కవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version