దిల్ రాజు- చెర్రీ కాంబోలో మరో మూవీ.. తక్కువ రెమ్యూనరేషన్‌కు?

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో మరో మూవీ తెరకెక్కనున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరిలో కాంబోలో ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతి పండుగకు వచ్చి ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేయగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కగా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు.‘RC-16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుంది. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే చెర్రీ-దిల్ రాజు కాంబోలో మరో మూవీ రాబోతున్నదని, ఇందులో చరణ్ తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మార్చిలో ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version