సాయి పల్లవి పై గరికిపాటి కామెంట్స్ వైరల్.. నీకు నమస్కారం అంటూ..!

-

తాజాగా సాయి పల్లవి మీద గరికిపాటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గరికపాటి సాయి పల్లవి గురించి మాట్లాడారు. ఫిదా సినిమాతో వెండితెరకి ఎంట్రీ ఇచ్చి తన యాక్టింగ్ తో అభిమానుల్ని ఆకట్టుకుంది. సాయి పల్లవి పై గరికపాటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గరికపాటి నరసింహారావు గురించి అందరికీ తెలుసు ఆధ్యాత్మిక అంశాల మీద ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. సినీ సెలబ్రిటీల గురించి కూడా కామెంట్లు చేస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటారు సినిమా రంగంలో చూసి మా అమ్మాయి లాంటిది అనుకున్న సాయి పల్లవి మాటలు నన్ను ఆకర్షించాయన్నారు.

ఎంత చక్కటి నవ్వు మెల్లమెల్లగా వచ్చింది క్రీం బిస్కెట్ వేసింది అని అన్నారు. నేను అన్ని పాత్రలు ఒప్పుకోను కథ విని నాకు తగిలింది అయితేనే చేస్తాను లేదంటే వదిలేస్తాను నేను ఎప్పుడు పొట్టి దోస్తులు వేసుకోను అవి నాకు అసౌకర్యంగా ఉంటాయి మా తల్లిదండ్రులు నా సినిమాను చూసి గౌరవించాలని నా పిల్లలు కూడా గర్వంగా నా సినిమాలు చూడాలి అని సాయి పల్లవి అన్నారు. ఆ మాటలకి గరికపాటి చిన్నదానివైనా నీకు నమస్కారం చేయాలని నీలాంటి వాళ్ళు సినిమా రంగానికి రావాలని అన్నారు గరికపాటి.

Read more RELATED
Recommended to you

Exit mobile version