ఓటర్ల వివరాల నమోదుకు ‘గరుడ’ యాప్‌

-

నకిలీ ఓటర్ల ఏరివేత మొదలైంది. అంతేకాకుండా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే.. ఓటర్ల వివరాల నమోదుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘గరుడ’ యాప్‌ను వినియోగించుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన ఎలక్టోరల్‌ ఫామ్‌లు 2022 ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు 33 జిల్లాల బూత్‌ లెవల్‌ అధికారులకు ఇస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా సీఈవో వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ.. కిందిస్థాయి బూత్‌ లెవల్‌ అధికారులకు రేపటిలోగా శిక్షణను పూర్తి చేయాలని జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు.

జిల్లా స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి సవరించిన ఫామ్‌ల గురించి అవగాహన కల్పించాలని సూచించారు వికాస్‌రాజ్. కొత్త ఎలక్టోరల్‌ ఫామ్‌ల ద్వారా ఓటర్లను నమోదు చేయడం చాలా సులభమని, ‘గరుడ’ యాప్‌ను వినియోగించుకొంటే పని మరింత వేగంగా పూర్తవుతుందని అధికారులకు తెలిపారు వికాస్‌రాజ్‌. అయితే ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో ఓటర్‌ నమోదు ప్రక్రియ జరుగుతోంది. కానీ.. మరింత సులభతరంగా ఓటరు నమోదు ప్రక్రియను సాగించేందుకు గరుడ యాప్‌ను ఎన్నికల సంఘం తీసుకువచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version