ప్రతీ నెలా కూడా గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. ఈ నెల కూడా గ్యాస్ సిలెండర్ ధరల్లో మార్పులు వచ్చాయి. ప్రతీ నెలా ఒకటో తేదీన గ్యాస్ ధరలు పెరగొచ్చు, తరగచ్చు లేదంటే అలానే స్థిరంగానే ఉండచ్చు. ఇక ఈ నెల అయితే వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ వినిపించాయి. ప్రతీ నెలా ఒకటో తేదీన మారతాయి. ఈరోజు (మే 1) రేట్లు తగ్గించాయి.
ఇక ఎంత తగ్గిందో చూద్దాం.. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 171.50 మేర తగ్గింది. ఈ విషయాన్ని ప్రకటించాయి. ఈ కొత్త ధరలు మే ఒకటి నుండి అమలులోకి రానున్నాయి. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1856.50కి తగ్గింది. ముంబైలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,808.50 గా వుంది. కోల్‌కతాలో అయితే రూ. 1,960.50, చెన్నైలో రూ.2,021.50గా ఉంది.
మార్చిలో రూ.350 మేరకు కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచారు. ఏప్రిల్‌లో రూ. 91.50 చొప్పున తగ్గించాయి. ఈసారి ఇప్పుడు మే లో మరోసారి రూ. 171.50 మేర కమర్షియల్ సిలిండర్లపై ధరను తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. అదే గృహ అవసరాలకు వాడే సిలిండర్ విషయంలో చూస్తే ఏ మార్పూ లేదు. వాటి ధరలు స్థిరంగానే వున్నాయి. దీంతో సామాన్యులకు కాస్త ఊరట లభించింది.