ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ల పర్వం సైతం మొదలైపోయింది. కాగా, నామినేషన్ల దాఖలుకు నేడే ఆఖరు తేదీగా ఈసీ నిర్ణయించింది.
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీకీ మొత్తం ఇప్పటి వరకు 85 నామినేషన్లు దాఖలైనట్లుగా అధికారులు ప్రకటించారు. నేటితో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు 17 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం.