ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత గేట్ పరీక్షలో తప్పనిసరి అంటూ వచ్చిన వార్తాలను ఏఐసీటీఈ వైస్ చైర్మన్ పూనియా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను సైతం విడుదల చేశారు. ఇంజనీరింగ్ పట్టా పొందేందుకు గేట్ పరీక్ష తప్పనిసరి అంటూ కొన్ని పత్రికల్లో గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇంజనీరింగ్ పట్టా పై కొనసాగుతున్న సందిగ్థతకు తెరపడింది. గేట్ తప్పనిసరంటూ వచ్చిన వార్తలతో ఇంజనీరింగ్ విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు.