డ్రగ్స్‌ కేసులో ఆర్యన్ అరెస్టుపై తొలిసారి మాట్లాడిన గౌరీ ఖాన్‌

-

కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో ఈ వీక్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ లో బాలీవుడ్ వైవ్స్ అదేనండి బాలీవుడ్ స్టార్స్ భార్యలను గెస్టులుగా పిలిచారు. బాలీవుడ్ వైవ్స్ అనగానే మొదటి గుర్తొచ్చే పేరు గౌరీ ఖాన్. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ భార్య. గౌరీఖాన్ తో పాటు కరణ్ జోహర్ ఈ ఎపిసోడ్ లో గౌరీ ఫ్రెండ్స్, బాలీవుడ్ వైవ్స్ సిరీస్ ఫేం మాహిప్ కపూర్, భావనా పాండేలను గెస్టులుగా పిలిచాడు.

ప్రతిసారి లాగే కరణ్.. ఈసారి కూడా తన షోలో గెస్టుల వ్యక్తిగత, వృత్తిపర అంశాల గురించి మాట్లాడాడు. బాలీవుడ్ స్టార్‌ షారుక్‌ ఖాన్-గౌరీ ఖాన్ ల తనయుడు ఆర్యన్ ఖాన్ గతేడాది డ్రగ్స్ కేసులో అరెస్టయిన వ్యవహారం గురించి  తెలిసిందే. కరణ్ తన లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ విషయం గురించి గౌరీ ఖాన్ తో ప్రస్తావించాడు. ఈ అరెస్టు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి షారుఖ్ కుటుంబం దీనిపై బహిర్గతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ మొట్టమొదటి సారి గౌరీఖాన్ తన కొడుకు అరెస్టుపై పెదవి విప్పింది.

‘వ్యక్తిగతంగా మీ కుటుంబం క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంది. అప్పుడు మీరంతా స్ట్రాంగ్ గా కనిపించారు.  అదంతా ఈజీ కాదని నాకు తెలుసు. గౌరీ.. ఆ సమయంలో మీరు మరింత స్ట్రాంగ్ గా ఉండటం నేను గమనించాను. మీరు దానిని ఎలా ఎదుర్కొన్నారు..?’ అంటూ ఆర్యన్ ఖాన్‌ కేసును నేరుగా ప్రస్తావించకుండా కరణ్ ప్రశ్నించారు.

దీనికి గౌరి స్పందిస్తూ.. ‘ఒక తల్లిగా, ఒక కుటుంబంగా అంతకంటే కఠిన పరిస్థితి మరొకటి లేదు. కానీ, మేం బలంగా నిలబడ్డాం.  అందరి ప్రేమను పొందిన ఒక ప్రదేశంలో ఉన్నామని మాత్రం చెప్పగలను. ఎంతోమంది స్నేహితులు అండగా నిలిచారు. ఆ సమయంలో మద్దతుగా ఉన్న కొందరు మాకు తెలీదు కూడా. ఎన్నో సందేశాలు వచ్చాయి. ఎంతో ప్రేమను కురిపించారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.

ముంబయి తీరంలోని ఓ క్రూజ్‌ నౌకలో మాదక ద్రవ్యాలు లభించడం.. అదే నౌకలో ఆర్యన్‌ ఖాన్‌ ఉండటంతో అతడిని అరెస్టు చేశారు. గతేడాది అక్టోబరు 3న ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న అతడు.. అక్టోబరు 30న బెయిల్‌పై విడుదలయ్యాడు. కోర్టు ఆదేశాల మేరకు ఎన్సీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. అయితే, ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో.. ఎన్సీబీ అతడికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version