నాకు పద్మశ్రీ వద్దు.. తిరస్కరించిన గీతా మెహతా.. ఎందుకంటే?

-

గీతా మెహతా.. ఈమె పేరు తక్కువగా విని ఉంటారు. పుస్తకాల అభిరుచి ఉన్నవాళ్లకు మాత్రం ఈమె పేరు పరిచయం ఉంటుంది. ఒడిశాకు చెందిన వాళ్లకు కూడా ఈమె సుపరిచితురాలే. ప్రముఖ రచయిత్రి ఈమె. అంతే కాదు.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి. తాజాగా ఈమె వార్తల్లో ఎందుకు నిలిచారంటే.. కేంద్ర ప్రభుత్వం నిన్న గీతా మెహతాను సాహిత్యంలో ఆమె చేసిన సేవకు గాను పద్మశ్రీతో సత్కరించింది. కానీ.. ఆమె పద్మశ్రీని తిరస్కరించారు. న్యూయార్క్‌లో ఉన్న గీతా.. ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేశారు. ఎన్నికల ముందు పద్మ అవార్డులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని ఆమె ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.

పద్మశ్రీకి నన్ను ఎంపిక చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. కాకపోతే.. సాధారణ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇలా పద్మ అవార్డులను ప్రకటించడం సరైన సమయం కాదు. అది నాకు బాధ కలిగించింది. అందుకే.. నేను పద్మశ్రీ అవార్డును తిరస్కరిస్తున్నాను.. అని మెహతా నోట్‌లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version