మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న జెనీలియా.. రామ్ తోనే జోడీ

-

రామ్ జెనీలియా అంటే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. వీరిద్ద‌రూ క‌లిసి చేసిన ‘రెడీ’ సినిమాలో ఈ జోడీ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 2008లో వచ్చిన ఈ మూవీ మంచి విజ‌యం సాధించింది. అలాంటి ఈ క్రేజీ జోడీ మరోసారి తెరపై కనిపించనున్నట్టు స‌మాచారం. అయితే ఈ సారి ఆమె రామ్ సరసన హీరోయిన్ గా కాకుండా ఓ ఇంపార్టెంట్ రోల్ చేయ‌బోతుంద‌ని తెలుస్తోంది.


ఇప్పుడు ఈ విషయమే సినీ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. చాలాకాలం తరువాత జెనీలియా రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావ‌డంతో మంచి అంచనాలు తెస్తోంది. తెలుగులో ఈ అమ్మ‌డుకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో పెద్ద హీరోల‌తో చేసింది. ఇప్ప‌టికీ ఆ క్రేజ్ అలాగే ఉంది.
ఇక పెళ్లి అయిన త‌ర్వాత ఈ ముద్దుగుమ్మ కాస్త విరామం తీసుకుంది. ద‌గ్గుబాటి రానాతో చేసిన ‘నా ఇష్టం’ సినిమానే ఈ పిల్ల‌కు తెలుగులో చివ‌రి సినిమా. ఆ తరువాత ఆమె టాలీవుడ్ లో పెద్ద‌గా సినిమాలు చేయ‌లేదు. మళ్లీ తొమ్మిదేళ్ల తరువాత ఆమె పేరు ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రామ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. జెనీలియాను ఏ సినిమా కోసం సంప్రదించారనేదే పూర్తిగా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ పిల్ల మ‌ళ్లీ టాలీవుడ్ లోకి రావ‌డం కాస్త క్రేజ్ అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version