కరోనా అలర్ట్: వ్యాక్సిన్ వేయించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

-

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2 లక్షలకుపైగా కరోనా కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. కేసుల సంఖ్య పెరగడంతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. నిన్న ఒక్కరోజే 2వేలకుపైగా కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య లక్ష 82 వేలకుపైగా పెరిగింది. కేసుల తీవ్రత పెరగడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. టీకా ప్రచారం వేగవంతం చేస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 13.19 కోట్లకుపైగా ప్రజలకు టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 18 ఏళ్లు నిండిన వారికి మే 1వ తేదీ నుంచి వేయిస్తున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే చాలా మందికి కరోనా వ్యాక్సిన్ వేసుకునే ముందు.. వేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియదు. ఈ రోజు కరోనా వ్యాక్సిన్ వేయించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

కరోనా వ్యాక్సినేషన్

అలెర్జీలు ఉంటే..
కొందరికీ సాధారణంగా మెడికల్ అలెర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి టీకా వేసుకున్న పడదు. అలాంటప్పుడు మీరు ముందుగానే ఈ విషయాన్ని వైద్యులకు తెలియజేయాలి. అయితే టీకా వేయించుకునే ముందు కడుపు నిండా ఆహారం తినాలి. ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని తీసుకుని.. కంటి నిండా నిద్రపోవాలి. నిద్ర రాలేనప్పుడు సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి. కరోనా వ్యాక్సినేషన్‌పై భయం, ఆందోళన ఉన్నప్పుడు వైద్యులను తప్పకుండా సంప్రదించాలి. వైద్యులు మీ భయాన్ని పొగొట్టేందుకు ప్రయత్నిస్తారు. మీకు నమ్మకం ఏర్పడి.. టీకా వేయించుకోవడానికి ముందుకు వస్తారు.

డయాబెటిస్, రక్తపోటు ఉన్నవారు..
డయాబెటిస్, రక్తపోటు ఉన్నవారు వ్యాక్సినేషన్ వేయించుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగులు, ముఖ్యంగా కీమోథెరిపీ చేయించుకునే వారు టీకా వేయించుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. అలాగే కరోనాకు చికిత్సగా ప్లాస్మా లేదా మోనోక్లోనల్ యాంటీబాడీస్ తీసుకున్న వారు సైతం వైద్యులకు తెలియజేయాలి. ఆరోగ్యపరమైన విషయాలు వైద్యులకు సంప్రదించిన తర్వాతే వ్యాక్సిన్ వేయించుకోవడం ఉత్తమం. తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకుని వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. కొందరు బాధితులకు అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో మీకు నార్మల్‌గా ఉంటే.. ఎమర్జెన్సీ కేసులను ముందుకు పంపించాలి. అయితే టీకా వేసిన ప్రదేశంలో నొప్పి వస్తుంది. దీనికి భయపడవద్దు. టీకా వేసిన తర్వాత జ్వరం, చలి, అలసట వంటి లక్షణాలు వస్తాయి. కొద్ది రోజుల తర్వాత అవే తగ్గిపోతాయి.

వ్యాక్సినేషన్ తర్వాత..
మీరు వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కరోనా నివారణ నియమాలను కచ్చితంగా పాటించాలి. మాస్కులు ధరించడం, శానిటైజర్‌తో చేతులను శుభ్రంగా కడుక్కోవడం, సామాజికదూరం పాటించడం ఎంతో ముఖ్యం. అలాగే పౌష్టికాహారాన్ని తీసుకోవడం కూడా చాలా అవసరం. తగినంత నీరు తాగాలి. పరిగడపున వేడి నీళ్లు 2-3 గ్లాసులు తాగాలి. ఎండాకాలంలో ఫ్రూట్ జ్యూసులు తాగండి. వేయించిన, కాల్చిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి. అలాగే మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండాలి. రోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే కరోనాను జయించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version